News October 3, 2025

తిరుపతిలో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

తిరుపతిలోని విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, లింక్ బస్టాండ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలకుపైగా బాంబ్, డాగ్ స్క్వాడ్ లు తనిఖీ చేపట్టాయి. మొత్తం రెండు బృందాలు తిరుపతిలోని అధిక రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.

Similar News

News October 3, 2025

368 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ పాసై, 20-33 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.rrbapply.gov.in/<<>>

News October 3, 2025

డ్రైవర్ల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయం: కలెక్టర్

image

ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు ఈ నెల 4వ తేదీన వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుంది. కోనసీమ జిల్లాలో 7,709 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు.

News October 3, 2025

సారీ మమ్మీ బతకాలని లేదు: ఇట్లు నీ పింకీ

image

TG: పెదనాన్న వేధింపులు తాళలేక మేడ్చల్(D) కొంపల్లిలో అంజలి(17) ఆత్మహత్య చేసుకున్నారు. ‘అమ్మా నన్ను క్షమించు. బతకాలని లేదు. నాన్న చనిపోయాక పెదనాన్న ప్రతివారం గొడవకు వస్తున్నాడు. నాకు అవమానంగా ఉంది. మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు. ఫైనాన్స్ ఇప్పించి తానే నాన్నను చంపానని నాతో అన్నాడు. పెదనాన్నకు కచ్చితంగా శిక్ష పడాలి. సారీ మమ్మీ. ఇట్లు నీ పింకీ’ అని ఆమె సూసైడ్ నోట్‌ రాశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.