News June 29, 2024

తిరుపతిలో భార్యాభర్తకు జైలుశిక్ష

image

చీటింగ్ కేసులో తిరుపతికి చెందిన భార్యాభర్తలకు జైలుశిక్ష పడింది. ఫిర్యాది తరఫు న్యాయవాది జి.వెంకట కుమార్ వివరాల మేరకు.. నగరానికి చెందిన కె.శ్రీనివాసులు, కె.ఓంకార లక్ష్మి ఒకరికి అప్పు తీర్చేందుకు భార్య పేరుతో ఉన్న చెక్‌పై భర్త సంతకం పెట్టారు. దీంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరికీ మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి ఎం.సంధ్యారాణి తీర్పు చెప్పారు.

Similar News

News July 1, 2024

చిత్తూరు: 3 నుంచి వినతుల స్వీకరణ

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి బుధవారం డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్టు చిత్తూరు ఎస్ఈ సురేంద్ర నాయుడు తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఎనిమిది డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ ఈనెల 3 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.

News July 1, 2024

తిరుపతి: 4 నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్

image

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్-2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4 నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1వ తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేట్ ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. 13న మార్పులు చేర్పులు, 16న సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.

News July 1, 2024

అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి

image

వైసీపీ పాలనలో జగన్ తర్వాత ఎక్కువగా అక్రమాలకు పాల్పడి దోచుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ‘రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీదే పెద్ద మాఫియా. ల్యాండ్, వైన్, మైన్ అన్ని కుంభకోణాలు చేశారు. వాటిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలోనే పుంగనూరుకు వెళ్లడానికి మిథున్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు’ అని మంత్రి చెప్పారు.