News April 6, 2024
తిరుపతిలో మరో 31మంది వలంటీర్లు రాజీనామా

ఒత్తిళ్లు లేదా ఇతర కారణాల వలన చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం. వీరిలో గురువారమే కోట మండలంలో 24మంది, ఏర్పేడులో ఐదుగురు, పుత్తూరులో ఇద్దరు, తిరుపతిలో మరో 31 మందితో పాటు ఇంతా పలు చోట్ల వాలంటీర్లు రాజీనామా చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2026
చిత్తూరు జిల్లాలో RDOల బదిలీ

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 25, 2026
చిత్తూరు: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News February 25, 2026
చిత్తూరు: విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన!

చిత్తూరు జిల్లాలో ఓ టీచర్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ టీచర్‌గా వెంకటేశ్ పనిచేస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


