News November 27, 2025
తిరుపతిలో రూ.3 కోట్లతో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్‌షిప్

తిరుపతిని మరింత అభివృద్ధి చేసేలా 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో ఆధ్యాత్మిక టౌన్‌షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డెల్లా గ్రూప్ ఈ టౌన్‌షిప్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇందులో 5 వేల సంవత్సరాల హిందూ చరిత్రను ప్రతిబింబించే ఎగ్జిబిషన్, వసుధైక కుటుంబం టౌన్‌షిప్ వంటి ఆకర్షణలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
సాలూరు: మంత్రి పీఏ రాజీనామా

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఏ సతీష్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలు బాధాకరమని, కావాలనే తనపై కుట్రలు పన్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. ఏ రోజూ మంత్రి పేరు చెప్పుకొని లబ్ధి పొందేందుకు ప్రయత్నించలేదన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు.
News November 28, 2025
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.
News November 28, 2025
NTR: ఆ MLA తీరు అంతేనా.? షాక్‌కి గురైన నేతలు, అధికారులు.!

మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో నిన్న జరిగిన వైద్య సేవల సమీక్షలో MLA తీరు చర్చనీయాంశమైంది. పాత ప్రభుత్వాసుపత్రిలో చివరి దశకు చేరుకున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో రూ.3కోట్ల అవినీతి జరిగిందంటూ విజయవాడకు చెందిన ఓ MLA ఆరోపించారు. నిర్మాణం నిలిపివేసి విచారణ జరపాలని పట్టుబట్టడంతో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రోగుల పరిస్థితిని పట్టించుకోకుండా MLA మాట్లాడటంపై సమావేశంలో అసహనం వ్యక్తమైంది.


