News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
Similar News
News February 27, 2026
ANU: ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9వ తేదీ లోపు రూ.1,860 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.
News February 27, 2026
74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.
News February 27, 2026
సిద్దిపేటలో రేపు స్టేట్ లెవల్ ‘యూత్ పార్లమెంట్’

సిద్దిపేటలోని విపంచికా నిలయంలో గురువారం జిల్లా స్థాయి ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. సునీత తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని, వారి అభిప్రాయాలను పంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు.


