News January 3, 2026
తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికిపాటి, సుస్మిత కొణిదెల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొననున్నారు.
Similar News
News February 19, 2026
మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News February 19, 2026
చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.
News February 19, 2026
చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


