News December 10, 2024

తిరుప‌తిలో రైల్వే డివిజ‌న్ ఏర్పాటు చేయండి: ఎంపీ

image

తిరుప‌తి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాల‌ని ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంట్ శీతాకాలం స‌మావేశాల్లో భాగంగా జీరో అవ‌ర్‌లో మంగ‌ళ‌వారం తిరుప‌తి ఎంపీ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ..ప్ర‌సిద్ధ ఆధ్మాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తి విశిష్ట‌త‌ల‌ను వివరిస్తూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News November 11, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో మౌలానాకు నివాళి

image

నెల్లూరు కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరిగింది. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా నివాళి అర్పించారు. దేశంలో విద్యావ్యవస్థకు సంస్కరణలతో అబుల్ కలామ్ బాటలు వేశారని తెలిపారు.

News November 11, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. సచివాలయ ఉద్యోగి మృతి

image

నెల్లూరు NTR నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి ముజాహిద్దీన్ అలీ మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈయన ద్వారకా నగర్-2 వార్డు సచివాలయంలో శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. బైక్‌పై వస్తుండగా లారీ ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు.

News November 11, 2025

కావలి: వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం

image

వృద్ధురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించిన ఘటన కావలి మండలంలో జరిగింది. కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మనోజ్ ప్రభాకర్ వృద్ధురాలి(75) ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.