News February 3, 2026
తిరుపతిలో విద్యార్థి సంఘాలు నాయకుల కిడ్నాప్

యాక్టర్ మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి SFI, AISF నేతలు సిద్ధమయ్యారు. దీంతో మోహన్ బాబు అనుచరులు 30మంది SFI జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, SFI SVU నేత వినోద్‌పై దాడికి పాల్పడడమే కాకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని CPM నేత కందారపు మురళి అన్నారు. విద్యార్థి నేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ASP రవిమనోహర్, SP సుబ్బరాయుడుకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 21, 2026
ప.గో: ఉగాది గిఫ్ట్.. మరో DSC నోటిఫికేషన్!

ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా ఉమ్మడి ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెడుతున్నారు.
News February 21, 2026
నల్లగొండ: 14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్లగొండ 5వ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్లగొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సంతోష్ సూచించారు.
News February 21, 2026
నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.


