News January 12, 2025
తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి.. నిజమిదే
తిరుపతిలో శనివారం ముని కుమార్ అనే టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పులి దాడి చేయలేదని బాధితుడు తెలిపాడు. అతను డ్యూటీ నిమిత్తం వెళ్తుండగా సైన్స్ సెంటర్ సమీపంలో పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లడం చూశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడిపోగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న డీఎఫ్ వో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News January 12, 2025
తిరుమల పరకామణిలో దొంగతనం
తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
News January 12, 2025
నెల్లూరులో బాలకృష్ణ భారీ కటౌట్
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా నెల్లూరులోని ఎస్2 థియేటర్స్ వద్ద 36 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కటౌట్‌కు 300 కిలోల పూలతో తయారుచేసిన గజమాలను కోటంరెడ్డి ఆధ్వర్యంలో అలంకరించారు.
News January 11, 2025
BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి
ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.