News December 7, 2025
తిరుపతిలో సంచలన ఘటన.. MP కీలక నిర్ణయం

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇద్దరు అ.ఫ్రొఫెసర్లు విద్యార్థినిని <<18490909>>లైంగికంగా<<>> వేధించారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనను MP డాక్టర్ గురుమూర్తి నేషనల్ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖలు రాశారు. ఈ మేరకు బాధిత యువతికి న్యాయం చేయాలని ఆయన కోరారు.
Similar News
News December 14, 2025
మెదక్: మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85% పోలింగ్

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు 85% నమోదైంది. ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు స్వగ్రామం కొర్విపల్లి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కోనాపూర్‌లో ఓటేశారు. పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు సందర్శించారు.
News December 14, 2025
కామారెడ్డి జిల్లా 1PM UPDATE @ 77.62 శాతం

కామారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు (పోలింగ్ సమయం ముగిసే సమయానికి) 7 మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. గాంధారి-73.23%, లింగంపేట-82.20%, మహమ్మద్ నగర్-83.33%, నాగిరెడ్డిపేట-85.88%, నిజాంసాగర్-86.89%, పిట్లం-61.10%, ఎల్లారెడ్డి-87.81% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. మొత్తం 77.62%గా పోలింగ్ నమోదయ్యిందని వెల్లడించారు.
News December 14, 2025
NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.


