News December 24, 2025
తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్‌పై చర్చ

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికీ ప్రశ్నార్థకమే.
Similar News
News December 27, 2025
డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు

☛ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
☛ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
☛ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
☛ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
☛ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(ఫొటోలో) జననం
☛ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
☛ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత
News December 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 27, 2025
పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి: పార్వతీపురం కలెక్టర్

విద్యార్థులను కేవలం ఉత్తీర్ణులుగా చేయడం మాత్రమే కాకుండా, వారిని సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హితవుపలికారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యాబోధనలో ఉపాధ్యాయులు అనుసరించాల్సిన కీలక మార్పులపై పలు సూచనలు చేశారు.


