News December 24, 2025
తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్‌పై చర్చ

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.
Similar News
News December 26, 2025
ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.
News December 26, 2025
బాక్సింగ్ డే టెస్ట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

The Ashes: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో ENG కెప్టెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. 3 టెస్టుల్లోనూ ఓడిన ఇంగ్లండ్ ఈ టెస్టులోనైనా గెలిచి బోణి కొడుతుందేమో చూడాలి.
AUS: హెడ్, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), ఖవాజా, కేరీ, గ్రీన్, నేజర్, స్టార్క్, రిచర్డ్‌సన్, బోలాండ్
ENG: క్రాలే, డకెట్, బెథెల్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), స్మిత్, విల్ జాక్స్, అట్కిన్సన్, కార్స్, టంగ్
News December 26, 2025
బొంరాస్ పేట: 9వ తరగతి బాలుడికి హ్యాట్సాఫ్

బొంరాస్‌పేట మండలం బాపల్లితండాకు చెందిన అభినవ్ చౌహన్ అనే విద్యార్థి తన నిజాయితీని చాటుకున్నాడు. పొలానికి వెళ్తుండగా దొరికిన మొబైల్ ఫోన్‌ను తన తండ్రి శివ నాయక్ సాయంతో ఎస్ఐ బాల వెంకటరమణకు అందజేశాడు. బాలుడి బాధ్యతాయుత ప్రవర్తనను, నిజాయితీని ఎస్ఐ, పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. పోగొట్టుకున్న వస్తువును తిరిగి అప్పగించి మానవత్వం చాటుకున్న అభినవ్‌పై గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


