News April 18, 2024
తిరుపతిలో 16.97 లక్షలు సీజ్

సరైన పేపర్లు లేకుండా తరలిస్తున్న డబ్బును అలిపిరి పోలీసులు సీజ్ చేశారు. సీఐ రామచంద్రారెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ వాహనాలు తనిఖీ చేశారు. కాటన్ మిల్లు వద్ద బైకుపై తీసుకెళ్తున్న రూ.12.98 లక్షలు పట్టుకున్నారు. మంగళం రోడ్డు డీమార్ట్ వద్ద రూ.1.99 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కేటీ రోడ్డులో మరో రూ.2 లక్షలు పట్టుబడింది. మొత్తంగా రూ.16.97 లక్షలు సీజ్ చేసి ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారు.
Similar News
News October 8, 2025
పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.
News October 8, 2025
చిత్తూరు: రైతులకు విరివిగా రుణాలు

ప్రభుత్వ ఆదేశాలతో రబీ సీజన్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని లీడ్ బ్యాంకు మేనేజర్ హరీష్ వివిధ బ్యాంకులను ఆదేశించారు. రబీ సీజన్‌లో 3,479 కోట్ల వరకు రైతులకు రుణాలు ఇస్తామన్నారు. జిల్లాలో 3.20 లక్షలు మంది రైతులు రుణాలు పొందవచ్చని సూచించారు. అనుబంధ రంగాలకు అదనంగా మరో రూ.16.3 కోట్లు రుణాలు మంజూరు చేస్తామన్నారు.
News October 8, 2025
చిత్తూరు: పోలీస్ కస్టడీకి పూర్వ ఆర్డీవో

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మరో కదలిక వచ్చింది. పూర్వ ఆర్డీవో మురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మురళికి ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును ఆశ్రయించింది.