News March 7, 2025
తిరుపతి: అయ్యో దేవుడా ఎంత పని చేశావు.!

ఇద్దరు కుమారుల ఎదుగుదలతో(రవితేజ, మునికుమార్) ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పెద్దవారై కాలేజీకి వెళుతుంటే సంబరపడ్డారు. మంచి ఉద్యోగాలు సాధించి తోడుగా ఉంటారని ఎన్నో కలలు కన్నారు. కాని విధికి ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం నచ్చలేదోమే. రోడ్డు ప్రమాదంలో ఓకేసారి ఇద్దరు కుమారులను బలి తీసుకుంది. పుత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న మంజునాథ, లక్ష్మి దంపతుల దీనగాధ ఇది.
Similar News
News December 16, 2025
నస్పూర్: ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

రేపు జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.
News December 16, 2025
సంగారెడ్డి: సమస్యత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పి రఘునందన్ రావు పాల్గొన్నారు.
News December 16, 2025
సంగారెడ్డి: మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

సంగారెడ్డి జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. 8 మండలాల్లో 207 సర్పంచ్, 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉన్నారు. 1769 పోలింగ్ కేంద్రాలు, 351 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించాలని కలెక్టర్ కోరారు.


