News March 7, 2025

తిరుపతి: అవును.. పోలీసులే క్లీన్ చేస్తారు..!

image

తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్‌ను సిబ్బందే క్లీన్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు శ్రమదానం చేశారు. స్టేషన్‌తో పాటు పరిసరాల్లోని చెత్తను తొలగించారు. పోలీసులే చీపురపట్టి క్లీన్ చేయడం విశేషం.

Similar News

News February 28, 2026

దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త!

image

AP: ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని APSDMA తెలిపింది. సెంట్రల్ ఆంధ్రలో ఎక్కువ రోజుల పాటు వడగాలులు వీస్తాయంది. ఎండతీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు క్యాప్, కర్చీఫ్, తెలుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. అలాగే వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలని సూచించింది.

News February 28, 2026

NRPT: మార్చి 2న జాబ్ మేళా

image

నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 2న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత శనివారం ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు కలశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని చెప్పారు. ఏడుకు పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని అన్నారు.

News February 28, 2026

వేట్లపాలెం ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

image

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ బాధితులకు రూ. 50 వేల చొప్పున పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషాద సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.