News October 14, 2025
తిరుపతి: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో శిక్షణ

APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC) తిరుపతిలో అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర వెల్లడించారు. పదో తరగతి పాసై, 15 నుంచి 45 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఎస్వీ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న NAC కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 20.
Similar News
News October 14, 2025
బాలుడిపై లైంగిక దాడి.. టీచర్ సూసైడ్

విద్యార్థిపై ఉపాధ్యాయుడు<<17996239>> లైంగిక దాడికి<<>> పాల్పడిన ఘటన కొనిజర్ల మండలం అమ్మపాలెంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో ప్రభాకర్‌పై పోక్సో కేసు నమోదయింది. ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రభాకర్‌ను విధుల నుంచి తొలగించారు. విషయం బయటకు రావడంతో పరువుపోతుందని భావించిన అతను పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 14, 2025
పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి?

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>
News October 14, 2025
NABARDలో ఉద్యోగాలు

నాబార్డ్ 6 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ( BCA, IT), ME, M.TECH, MCA, MBA, CA, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. వెబ్‌సైట్: https://www.nabard.org/