News November 21, 2025
తిరుపతి: ఆధార్ తప్పులతో ఆగిన ఆపార్..!

ఎన్ఈపీలో భాగంగా ఆధార్ లింక్‌తో విద్యార్థులకు ఆపార్ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 3,86,167 మంది ఉన్నారు. ఆపార్ వచ్చిన విద్యార్థులు 3,35,534 మంది కాగా.. పెండింగ్‌లో 50,633 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆపార్ నంబర్ తప్పనిసరి కావాల్సి ఉంది. ఇంటి పేర్లు, పుట్టిన తేదీల్లో ఎక్కువ శాతం తప్పులు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది.
Similar News
News November 21, 2025
ఎల్కతుర్తి: రైతులందరూ ఉపయోగించుకోవాలి: కలెక్టర్

ఎల్కతుర్తి మండలంలోని CCS పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఇంతకు ముందు పత్తిని రైతులు దూర ప్రాంతాల్లో అమ్ముకొనే వారు, కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రాంతాల్లో అమ్ముకునేందుకు CCS కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ సంతాజీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News November 21, 2025
జనగామ: మీడియా పాత్ర గణనీయం: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి నిరుపేదకి అందించే ప్రక్రియలో మీడియా రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లాకి వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన నేపథ్యంలో ప్రత్యక్షం గాను, పరోక్షంగాను సహకారం అందిస్తున్న జిల్లా మీడియా వారికి అభినందన కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం కలెక్టరెట్‌లోని కాన్ఫెరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేశారు.
News November 21, 2025
హనుమకొండ: ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి: జాన్ వెస్లీ

పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. హనుమకొండలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, సీసీఐ ద్వారా క్వింటాకు రూ.8,100 మద్దతు ధర కేంద్రం ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు.


