News March 24, 2024

తిరుపతి: ఆయన తప్ప.. ఎవరైనా OK!

image

జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. తిరుపతి సీటుపైనే స్తబ్దత నెలకొంది. చిత్తూరు MLA శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా ప్రతిపాదించగా జనసేనతో పాటు TDP నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నిన్న జనసేన నాయకులు నాగబాబును కలిసి చర్చించారు. లోకల్‌గా ఉన్న తనతో పాటు TDPలోని ఇద్దరు నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని తిరుపతిలో కీలకంగా ఉన్న జనసేన నాయకుడు చెప్పినట్లు సమాచారం.

Similar News

News February 21, 2026

పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

image

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్‌లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.

News February 21, 2026

ZP ఛైర్మన్ ఫిర్యాదుతో విషయం బయటకు..!

image

అధికార పార్టీ నేతల అండదండలతో పలమనేరులో ఉపాధి హామీ పనుల్లో భారీ <<19204272>>అవకతవకలు<<>> జరిగాయని చిత్తూరు ZP ఛైర్మన్ కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వేజెస్ రూపంలో అందించే నగదును ఏపీఓ, అసిస్టెంట్లు తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని డ్వామా పీడీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

News February 21, 2026

పలమనేరు: నకిలీ బిల్లుల సృష్టి కర్తలు వీళ్లే..!

image

<<19204252>>నకిలీ బిల్లుల<<>> వ్యవహారంలో APO రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఉషశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరులోని అంబేడ్కర్ నగర్ బసాపురం పోస్టాఫీస్‌లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా అకౌంట్లు ఓపెన్ చేశారని ప్రాథమిక సమాచారం. ముందు చేసిన పనులకు బిల్లు పెట్టినట్లు కొన్ని, డమ్మీ మస్టర్ క్రింద మరి కొన్ని బిల్లులు పెట్టినట్లు సమాచారం.