News October 30, 2025
తిరుపతి: ఆర్టీసీ ఉద్యోగుల నూతన కమిటీ నియామకం

ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రీజినల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేఈ శాస్త్రి వెల్లడించారు. తిరుపతి యూత్ హాస్టల్లో బుధవారం సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా సురేష్ నాయక్, కార్యదర్శిగా శ్రీనివాసులు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షుడిగా మైఖేల్, ముఖ్య సలహాదారుగా ద్వారకా నియమితులయ్యారు.
Similar News
News October 30, 2025
వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్.ఎన్. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News October 30, 2025
మేడిపల్లి: కులం పేరుతో దూషించి దాడి.. వ్యక్తికి జైలు

మేడిపల్లి మండలం కల్వకోటకి చెందిన గోడ వెంకటిపై కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ఆదె చందుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 21న బర్రెను ఢీకొట్టిన ఘటనపై మాటామాటా పెరిగి చందు వెంకటిని తిడుతూ దాడి చేశాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను SP అశోక్ కుమార్ అభినందించారు.
News October 30, 2025
మంచిర్యాల: ‘తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి’

జిల్లాలోని రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చివరి దశలో నష్టపోతుండటంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. దీనితో ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నామని, తమను ఆదుకోవడానికి రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


