News April 21, 2024
తిరుపతి: ఆ రోజు కార్మికులకు సెలవు

ఎన్నికలు జరిగే మే 13న ఉద్యోగ, ఉపాధి, కార్మికులకు సెలవు రోజని కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం- 1988 ప్రకారం ఎన్నికల రోజున వేతనాలతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అర్హుడైన ఓటరుకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించి సెలవు జారీ చేయకపోతే జరిమానాతో కూడిన శిక్షార్హులని చెప్పారు.
Similar News
News April 20, 2025
కుప్పం: వేలిముద్రలతో సీఎం చంద్రబాబు చిత్రం

సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజును పురస్కరించుకొని కుప్పం పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్నంగా వేసిన థంబ్ ఆర్ట్ చిత్రాన్ని కుప్పం టీడీపీ కార్యాలయానికి అందజేశారు. కాగా చంద్రబాబు థంబ్ ఆర్ట్ చిత్రంలో మేము సైతం అంటూ టీడీపీ కుప్పం ఇన్‌ఛార్జ్ మునిగత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు తమ వేలిముద్రలను వేశారు. ఈ చిత్రం కాస్త పార్టీ కార్యాలయంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
News April 20, 2025
చిత్తూరు జిల్లాలో వేసవి తాపం

చిత్తూరు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం 41 డిగ్రీలకు పెరిగాయి. నగరిలో 41.4, శ్రీరంగ రాజపురం, తవణంపల్లె మండలాల్లో 41.2, గుడిపాల, చిత్తూరు మండలాల్లో 40.8, యాదమరిలో 40.3, గంగాధరనెల్లూరులో 40.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగారుపాళ్యంలో 38.6, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల, వెదురుకుప్పం మండలాల్లో 38.1, చౌడేపల్లె, ఐరాల, కార్వేటినగరం, నిండ్ర, పాలసముద్రంలో 37.7 డిగ్రీలు నమోదైంది.
News April 20, 2025
సదుం: అధికారుల తీరుతో విసిగి ACBకి ఫిర్యాదు

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు షఫీ ఉల్లా తెలిపారు. తనకు సంబంధించిన 5.60 ఎకరాల సెటిల్మెంట్ భూమిని అధికారులు అసైన్మెంట్‌గా మార్పు చేశారని.. తిరిగి దానిని సెటిల్మెంట్‌గా నమోదు చేసేందుకు రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని ఆయన వాపోయారు. దానిని చెల్లించేందుకు ఇష్టం లేకనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి తాహశీల్దార్, వీఆర్ఓలను పట్టించినట్లు చెప్పారు.