News December 31, 2024
తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ లో హత్య

తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని బాకీ చెల్లించాలని అడిగినందుకు పదునైన ఆయుధంతో పొడిచాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 8, 2025
కనకదాసు చిత్ర పటానికి SP నివాళి

భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ శనివారం నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించి విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సమానత్వానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం కుల, మత తేడాలను చెరిపివేసేలా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా, 1 టౌన్ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.
News November 7, 2025
కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల స్థాపన ఇక్కడే.!

☞ కుప్పం (M) పలార్లపల్లి వద్ద అలీఫ్ ☞ అనిమిగానిపల్లి సమీపంలో ఆదిత్య బిర్లా
☞శాంతిపురం (M) తంబిగానిపల్లి వద్ద మదర్ డెయిరీ ☞ రామకుప్పం(M) విజిలాపురం వద్ద ఈరైస్
☞గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ACE, శ్రీజ డెయిరీ, SVF సోయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
☞ మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు
☞ 8న వర్చువల్గా CM చంద్రబాబు శంకుస్థాపన.
News November 7, 2025
స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.


