News January 11, 2026
తిరుపతి: ఇక్కడ మగవాళ్లే పూజలు చేస్తారు..!

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఆదివారం పొంగళ్లు పెట్టారు. ఇక్కడి శ్రీసంజీవరాయ స్వామికి మగవారే పొంగళ్లు పెట్టి పూజలు చేయడం ఇక్కడి అనవాయితీ. ఆలయంలో ఆడవారికి ప్రవేశం లేదు. ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పెడతారు. దేశ విదేశాల్లో ఉన్న మగవాళ్లు సైతం ఇక్కడికి వచ్చి పొంగళ్లు పెట్టడం విశేషం.
Similar News
News February 15, 2026
భారత్ 15 ఓవర్లు కూడా ఆడలేదు.. ఇమాద్ ఓవరాక్షన్!

భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు దాయాది మాజీ క్రికెటర్ ఇమాద్ వసీం ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. శ్రీలంక పరిస్థితుల్లో టీమ్‌ఇండియా 15 ఓవర్లు కూడా నిలబడలేదని, అక్కడ భారత్‌లో లాగా చిన్న బౌండరీలు ఉండవంటూ తన నోటి దురుసును బయట పెట్టుకున్నారు. పాక్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు తేలిపోతారని, దూకుడుగా ఆడాలని చూస్తే ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో గట్టిగానే కౌంటరిస్తున్నారు.
News February 15, 2026
NRPT: అడవిలో కొలువైన ‘ఔదుంబరేశ్వర’ చరిత్ర ఇదీ!

నారాయణపేటకు 3 కి.మీ. దూరంలో అడవిలో వెలసిన ఔదుంబరేశ్వర ఆలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. లోకాయపల్లి రాణి లక్ష్మమ్మ వృద్ధాప్యంలో కాశీకి వెళ్లలేనని శివుడిని వేడుకోగా, స్వామివారు ఆమె కలలో కనిపించి పడమటి కొండల్లో మేడి చెట్టు (ఔదుంబరం) కింద వెలిశానని చెప్పారు. అక్కడ స్వయంభూగా వెలసిన శివలింగాన్ని చూసి రాణి ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది.
News February 15, 2026
రాజమండ్రి: గమనిక.. రేపు రెవెన్యూ క్లినిక్‌లు రద్దు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ 16న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన PGRS/ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత కార్యాలయాలకు రావద్దని అర్జీదారులను కోరారు. తదుపరి సోమవారం నుండి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.


