News June 21, 2024

తిరుపతి ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా ధ్యానచంద్ర

image

తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమోషన్‌పై మైనింగ్ శాఖ కమిషనర్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ ధ్యానచంద్రను నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసే శాలువాతో సత్కరించారు.

Similar News

News February 21, 2026

చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

image

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News February 20, 2026

చిత్తూరు జిల్లాలో వాహనాల తనిఖీలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు చెప్పారు.

News February 20, 2026

చిత్తూరు: హెల్ప్ లైన్ నెంబర్లు గుర్తుంచుకోవాలి

image

అత్యవసర సమయాలలో ఉపయోగపడే 112 (ఎమర్జెన్సీ నెంబర్), 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) వంటి నెంబర్లను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా సూచించారు. చిత్తూరు విద్యాశ్రమం పాఠశాలలో శుక్రవారం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను ఎవరైనా అసౌకర్యంగా తాగితే టీచర్లు, తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.