News September 22, 2025

తిరుపతి: ఈనెల 24, 25 తేదీలలో ముఖ్యమంత్రి రాక

image

ఈనెల 24,25 తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయినట్లు తిరుపతి కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో ముందస్తు సెక్యూరిటీ ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. ఇతర విభాగాల అధికారులకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు.

Similar News

News September 22, 2025

మైనారిటీలకు ఆర్థిక భరోసా.. అక్టోబర్ 6 చివరి తేది

image

పేద మైనారిటీల కోసం TG ప్రభుత్వం “ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన” ద్వారా రూ.50,000, “రేవంతన్న కా సహారా” పథకం ద్వారా వాహనాల కోసం రూ.1 లక్ష వరకు ఆర్థికసహాయం అందిస్తోంది. ముస్లిం, సిక్, బౌద్ధ, జైన, పార్సీ మహిళలు, ఫకీర్, దూదెకులు తదితరులు అర్హులు. వయస్సు 21-55 ఏళ్లు, కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అక్టోబర్6 లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని PDPL మైనార్టీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు.

News September 22, 2025

ఆలూరు టీడీపీ నూతన ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి

image

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News September 22, 2025

ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలి: DRO

image

ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అనకాపల్లి DRO సత్యనారాయణరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ఓటరు జాబితా అభ్యంతరాలపై సమావేశం ఏర్పాటు చేశారు. జాబితాలో పొరపాట్లు, తప్పులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు.