News April 9, 2025
తిరుపతి: ఉద్యోగం తీసేశారని బైక్ ఎత్తుకెళ్లాడు..!

స్కూటర్ దొంగతనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా గాజులమండ్యం పోలీసులు వెల్లడించారు. నెల్లూరు(D) రాపూరు(M) గండవోలు పంచాయతీకి చెందిన ప్రసాద్ రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై కంపెనీ బయట ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News April 17, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.
News April 17, 2025
చిత్తూరు: ఈనెల 20 వరకు రేషన్ పంపిణీ

చిత్తూరు జిల్లాలో రేషన్ పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అధిక శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 17, 2025
CTR: మీరు ఇలా చేయకండి

చిత్తూరు సంతపేటలో బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజా ‘defabet sports’ యాప్‌లో బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. లాభాలు రావడంతో ఆశపడి భార్య నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బును యాప్‌లో పెట్టి పోగొట్టాడు. వారం వ్యవధిలోనే నాలుగైదు రూ.లక్షలు నష్టపోయాడు. ఎక్కడైనా బెట్టింగ్ జరిగినట్లు తెలిస్తే చిత్తూరు పోలీసుల వాట్సాప్ నంబరు 9440900005కు సమాచారం ఇవ్వాలని SP మణికంఠ సూచించారు.