News May 11, 2024
తిరుపతి: ఉద్యోగం పేరిట ఛీటింగ్

ఉద్యోగం పేరుతో నమ్మించి మోసగించిన సైబర్ నేరగాడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీఎస్పీ పద్మలత మాట్లాడుతూ పుత్తూరుకు చెందిన గుణశేఖర్(37)తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రవి అనే పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ పరిచయాలు పెంచుకుని, వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడు సురేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామన్నారు.
Similar News
News December 15, 2025
చిత్తూరులో పెరిగిన కోడిగుడ్ల ధర

చిత్తూరు జిల్లాలో కోడి గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో డజన్ రూ.84లకే లభించేవి. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కోళ్ల పెంపకం తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని, జనవరి అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
News December 15, 2025
చిత్తూరు జిల్లాలో ఘోరం..!

చిత్తూరు మండలం తుమ్మిందకు చెందిన బాబు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య కవిత ఆ బస్సులోనే హెల్పర్‌గా పనిచేస్తున్నారు. కవితకు ఇటీవల రూపేశ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో బంగారు నగలు ఇచ్చింది. వాటిని అతను తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. నగల విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్(4)తో కలిసి గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
News December 14, 2025
కుప్పం: పేలిన నాటు బాంబు.. పరిస్థితి విషమం

కుప్పం (M) కొట్టాలూరు పంచాయతీ ఎర్రమన్ను గుంతలు సమీపంలో నాటు బాంబు పేలి చిన్న చిన్న తంబి (38) తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న తంబి శరీరం ఓవైపు పూర్తిగా కాలిపోవడంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. చిన్న తంబి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


