News April 26, 2024
తిరుపతి ఎంపీగా పోటీ చేసిన నేత మృతి

టీడీపీ నేత కారుమంచి జయరాం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చనిపోయారు. పోలీసు శాఖలో పని చేసిన ఆయన రిటైర్మెంట్ తీసుకుని పొత్తులో భాగంగా 2014లో BJP తిరుపతి MP అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో YCP అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు TDPలో చేరారు. రేణిగుంట(M) అత్తూరులో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Similar News
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.