News April 3, 2024

తిరుపతి: ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య

image

తిరుపతిలో ఇండియా కూటమి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య పోటీ చేయనున్నట్లు బుధవారం స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు.

Similar News

News February 20, 2026

ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

image

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.

News February 19, 2026

మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

image

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్‌ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.

News February 19, 2026

చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

image

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.