News November 1, 2025

తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

image

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.

Similar News

News November 1, 2025

NZB: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నేపథ్యమిదే!

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన బోధన్ MLA సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలంలో 1949లో జన్మించారు. 1989లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1999లో బోధన్ నుంచి గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టారు. 7 పర్యాయాలు పోటీ చేసిన ఆయన 4 సార్లు MLAగా గెలిచారు. YSR హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.

News November 1, 2025

కామారెడ్డి: కన్నీటి ‘మొంథా’.. రోడ్డుపైనే రైతన్న నిద్ర

image

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైవే వెంబడి సర్వీస్ రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్ల లేక రెండు రోజులుగా రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ, రాత్రివేళ అక్కడే నిద్రపోతున్నారు. పిట్లంలోని హైవే సర్వీస్ రోడ్డుపై ఓ రైతు రాత్రి చలికి పడుకున్న దృశ్యమిది.

News November 1, 2025

ADB: విశ్వసనీయతకు పట్టం.. ఎట్టకేలకు పదవి

image

ఉమ్మడి ADB జిల్లాకు ఎట్టకేలకు మరో క్యాబినెట్ హోదా దక్కింది. గతంలో మంత్రి పదవికి వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు పోటీగా ఉండగా చెన్నూరు MLAకే మినిస్ట్రీని కట్టబెట్టారు. ఎందరో పార్టీని వీడిన కాంగ్రెస్‌ని నమ్ముకొని ఉన్న ప్రేమ్ సాగర్ రావును పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్​గా నియమించడంతో ఆయనకు సముచితస్థానం దక్కిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా ఇది బుజ్జగింపుల్లో భాగమని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.