News January 11, 2026

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

image

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు 11నెలల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.10వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ప్రయాణికుల చెక్-ఇన్, బ్యాగేజ్, టికెటింగ్, బోర్డింగ్ సేవల్లో శిక్షణ ఇస్తారు. ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వివరాలకు <>AIASL<<>> వెబ్‌సైట్ చెక్ చేయండి.

Similar News

News January 26, 2026

T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.

News January 26, 2026

బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు రేపు జరగనున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ ASP దీక్ష ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలను ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహకారంతో విస్తృతంగా నిర్వహించారు.

News January 26, 2026

చేగుంట: వన్యప్రాణుల లెక్క తేలింది

image

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ బీట్ పరిధి చిట్టోజి పల్లి అటవీ ప్రాంతంలో అఖిలభారత అటవీ జంతువుల గణన పూర్తయినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ తెలిపారు. పులులు, జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, నెమళ్లు, అడవి కోళ్ళు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు, సర్పాలు, పాములు, ఉభయచర ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేసినట్లు తెలిపారు.