News January 12, 2026

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

image

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్(ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు 11నెలల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.10వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ప్రయాణికుల చెక్-ఇన్, బ్యాగేజ్, టికెటింగ్, బోర్డింగ్ సేవల్లో శిక్షణ ఇస్తారు. ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వివరాలకు <>AIASL<<>> వెబ్‌సైట్ చెక్ చేయండి.

Similar News

News January 28, 2026

SKLM: ఉపాధ్యాయుడి నుంచి ఎక్సైజ్ ఎస్ఐగా

image

సంతబొమ్మాళి మండలం శివరాంపురం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెట్టు రామారావు విజయం సాధించారు. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో ఆయన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామారావు, గతంలో డీఎస్సీ ద్వారా టీచర్‌గా ఎంపికై సేవలు అందిస్తున్నారు. పట్టుదలతో చదివి ఇప్పుడు ఎస్ఐగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

News January 28, 2026

ప.గో: నివేదికలకే పరిమితమైన ‘కొల్లేరు’ పరిష్కారం – 1/4

image

<<18976687>>కొల్లేరు <<>>పరిరక్షణకు గతంలో నియమించిన మిత్ర, శ్రీరామకృష్ణయ్య కమిటీల నివేదికలను ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయి. సరస్సులో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టాలని, ఉప్పుటేరును విస్తరించి ముంపు నివారించాలని కమిటీలు సూచించినా.. ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వాలు మారుతున్నా పరిష్కారాలు కాగితాలకే పరిమితం కావడంతో సమస్య జఠిలమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 28, 2026

మేడారం బస్సుల్లో మేకల టికెట్‌ @400

image

మొక్కులు చెల్లించుకునే భక్తులు మేడారానికి తీసుకెళ్లే గొర్రెలు, మేకలకు బస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. జనగామ నుంచి మేడారానికి వెళ్లే భక్తుల నుంచి ఒక్కో మేక/గొర్రెకు రూ.400 వసూల్ చేస్తున్నారు. పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.250 వసూల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గొర్రె/మేకలకు ఛార్జీలు తీసుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు టికెట్ ధర రూ.400 చాలా ఎక్కువని ప్రశ్నిస్తున్నారు.