News February 5, 2026
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

ఉద్యోగాల పేరుతో ఫోన్ కాల్స్ చేసి డబ్బులు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరించారు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు, నెలకు రూ.32 వేల జీతమని నమ్మించి రెజ్యూమ్, ఆధార్, పొటోలు తీసుకొని ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద కాల్స్‌పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మీకూ ఇలాంటి కాల్ వచ్చిందా?
Similar News
News February 6, 2026
చిత్తూరు: హస్తం పార్టీ మళ్లీ పుంజుకునేనా.?

జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ పుంజుకునే అవకాశాలు తక్కువే. కేంద్ర మాజీ మంత్రి చింతా, స్థానిక నేతలు ప్రజల్లో అడపాదడపా తిరుగుతున్నా ఆ ప్రభావం కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తిరుగుతున్నారు. రఘువీరారెడ్డి వంటి నేతలు నాయకులలో నూతనోత్సాహం నింపేలా ప్రయత్నిస్తున్నారు. మరి మళ్లీ హస్తం పార్టీ జెండా ఎగురుతుందా.?
News February 6, 2026
చిత్తూరు: హజ్ యాత్రికులకు రేపు వైద్య పరీక్షలు

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు శనివారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖాజీముల్ హుజా జ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడంతో పాటు వ్యాక్సిన్ వేస్తారన్నారు.
News February 6, 2026
చిత్తూరు జిల్లా టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్.!

టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తత్కాల్ ద్వారా శుక్రవారం నుంచి ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అవకాశం కల్పించినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. వెయ్యి రూపాయల అపరాధ రుసుమును ఆన్‌లైన్‌లో ఈనెల 12లోపు చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని పరీక్షా విభాగాన్ని సంప్రదించాలని ఆయన కోరారు.


