News February 6, 2026

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లకు జైలుశిక్ష

image

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అలాగే రూ.6 లక్షల జరిమానా విధిస్తూ RSS ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు ఇచ్చారు. తమిళనాడుకు చెందిన శివమూర్తి సేతు, తిరుపతికి చెందిన శివమణి కరకంబాడి రిజర్వు ఫారెస్ట్ పరిధిలో పట్టుబడ్డారు. నేరం రుజువు కావడంతో వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

Similar News

News February 12, 2026

ఈ నెల 16న ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక

image

TG: 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 16న కలెక్టర్ల పర్యవేక్షణలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. రేపు కౌంటింగ్ జరగనుండగా గెలిచిన అభ్యర్థులు 16న ఉ.11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మ.12.30 గంటలకు మెజార్టీ ఆధారంగా ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక, తర్వాత వైస్ ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎంపికలో ఎక్స్‌అఫీషియో(MPలు, ఎమ్మెల్యేలు, MLCలు) సభ్యుల ఓట్లూ కీలకం కానున్నాయి.

News February 12, 2026

ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

image

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

image

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.