News July 7, 2025

తిరుపతి: ఎవరు లేని వారికి దేవుడే దిక్కు..!

image

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి బస్టాండు, రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వరకు పదులసంఖ్యలో కొందరు అక్కడే తిని అక్కడే పడుకుంటారు. వీరిలో కొందరు మద్యం మత్తులో గొడవలు పడి <<16976933>>హత్య<<>>లు, హత్యాయత్నాలు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో బిక్షగాళ్లు మాత్రమే ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం కొందరు సంచరిస్తూ రాత్రిపూట యాత్రికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. పోలీసులు భక్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.

Similar News

News July 7, 2025

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

image

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పలు ఉత్పత్తుల ధరలు కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2459. కనిష్ఠం: 2129, ✓ మక్కలు: గరిష్ఠం: 2200. కనిష్ఠం: 2200, ✓ పత్తి: గరిష్ఠం:7421. కనిష్ఠం: 3899, ✓ పసుపు(కాడి): గరిష్ఠం: 10,852. కనిష్ఠం: 3809, ✓ పసుపు(గోల): గరిష్ఠం: 10,559. కనిష్ఠం: 5298.

News July 7, 2025

రాయదుర్గంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

రాయదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న చాంద్‌బాషా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బాషా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాల మీద కూర్చున్నాడు. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టింది. గమనించిన లోకోపైలట్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.

News July 7, 2025

మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్

image

మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఈనెల 10న నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు.