News January 29, 2026

తిరుపతి: ఏడు దశల్లో ఎర్రచందనం స్మగ్లింగ్

image

ఎర్రచందనం అక్రమ రవాణా 7 దశల్లో జరుగుతుందని RSASTF గుర్తించింది. 1.కూలీ 2.మేస్త్రి 3.పైలెట్/ రవాణా ఏర్పాటు చేసే వారు 4.ట్రాన్స్‌పోర్ట్ 5.గోడౌన్ కీపర్ 6.ఎక్స్‌పోర్టర్ 7.ఇంటర్నేషనల్ స్మగ్లర్ల్‌గా నిర్థారించారు. ఈ దశల్లో నివారణ కోసం RSASTF 164 అడవిలోకి వచ్చి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టింది. నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. నెలలో ఆ పాయింట్లను ఒక్కటి లేదా రెండు సార్లు విజిట్ చేస్తుంటారు.

Similar News

News February 21, 2026

నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

image

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.

News February 21, 2026

అమెరికా అమ్మాయి.. మంచిర్యాల అబ్బాయి..!

image

అమెరికా న్యూయార్క్‌కు చెందిన అమ్మాయికి మన సింగరేణి ప్రాంతానికి చెందిన అబ్బాయితో శుక్రవారం హిందూ సాంప్రదాయంగా వివాహం జరిగింది. కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన గంగిపెల్లి ప్రణీత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడి అమ్మాయి లవీనతో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి పెద్దలను ఒప్పించి అమ్మాయి కోరిక మేరకు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అమెరికా అమ్మాయిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు.

News February 21, 2026

లొంగు‘బాట’లో దేవ్‌జీ?

image

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్‌‌జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్‌గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్‌జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.