News October 29, 2025
తిరుపతి: ఒక్కొక్కరికి రూ.3వేలు

తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పలువురు బాధితులుగా మారారు. వీరికి ప్రభుత్వం రూ.3వేల సాయం ప్రకటించింది. నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కలెక్టర్ వెకంటేశ్వర్ వెళ్లారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు, నిత్యావసరాలు అందజేశారు.
Similar News
News October 29, 2025
KPHBలో RAIDS.. మహిళలు, యువతులు అరెస్ట్

కూకట్‌పల్లిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ACP రవికిరణ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు KPHB మెట్రో స్టేషన్, పుల్లారెడ్డి స్వీట్ షాప్, మెట్రో పరిసర ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. యువకులు, వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న 11 మంది మహిళలు, యువతులను అదుపులోకి తీసుకొన్నారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. ఆరుగురికి 7 రోజుల రిమాండ్ విధించారు.
News October 29, 2025
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TG: మొంథా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.
News October 29, 2025
కాకినాడ జిల్లాలో సెలవులు క్యాన్సిల్

తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు ఈనెల 31 వరకు ముందు సెలవులు ప్రకటించారు. మంగళవారం రాత్రి తుఫాన్ తీరం దాటంతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈక్రమంలో గురువారం నుంచి విద్యాసంస్థలు తెరవాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ జిల్లాలో సైతం గురువారం నుంచే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.


