News February 13, 2025
తిరుపతి: కంప్యూటరైజేషన్‌తో రైతులకు సేవలు- కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలు చేపడుతోందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా రైతులకు త్వరలో విస్తృత సేవలు అందించనుందని ఆయన అన్నారు. ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు.
Similar News
News July 4, 2025
ఏలూరు: అల్లూరికి నివాళులర్పించిన ఎస్పీ

ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారిపై అల్లూరి చేసిన స్వాతంత్ర్య పోరాటం మరువలేమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
ఖమ్మం: ఆయిల్‌పామ్ సుంకంపై కేంద్రమంత్రికి తుమ్మల లేఖ

ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్రం మే 31న ముడి ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమన్నారు. రైతులకు లాభదాయకంగా ఉంటేనే ఆయిల్‌పామ్ సాగుకు ముందుకొస్తారని లేఖలో పేర్కొన్నారు.
News July 4, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.