News December 22, 2025
తిరుపతి: ‘కరంటోళ్ల జనబాట’కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం

ఏపీఎస్పీడీసీఎల్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా సీఎండీ శివశంకర్ ‘కరంటోళ్ల జనబాట’ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 22వ తేదీన పాకాల మండలంలో మంత్రి రవికుమార్ దీనిని ప్రారంభించనున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
Similar News
News December 22, 2025
వాట్సాప్‌లోనే ఈ-చలాన్లు.. ఇలా చెక్ చేసుకోండి!

AP: రాష్ట్ర ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్‌లో పోలీసు సర్వీసులూ చేరాయి. 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సర్వీసు కేటగిరీలోకి వెళ్తే ‘పోలీస్ శాఖ సేవలు’ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో FIR, FIR స్టేటస్, ఈ-చలాన్ వివరాలు తెలుసుకోవచ్చు. వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తే బండిపై నమోదైన ఈ-చలాన్ వివరాలు వస్తాయి. అక్కడే UPI ద్వారా చెల్లించవచ్చు.
News December 22, 2025
ఈ నెల 26 నుంచి వారికి వోచర్లు: ఇండిగో

విమాన సర్వీసుల <<18492900>>రద్దుతో<<>> ప్రభావితమైన ప్రయాణికులకు గరిష్ఠంగా రూ.10వేలు విలువ చేసే వోచర్స్‌ను DEC 26 నుంచి ఇండిగో ఇవ్వనుంది. ఏవియేషన్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభావితమైన ప్రయాణికులకు ఇవ్వాలని ఇండిగోకు సూచించారు. వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకున్న వారికి వారంలోపే ఇవ్వనుంది. అటు ట్రావెల్ ఏజెన్సీల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నెల 3-5 మధ్య ప్రయాణాలకే వర్తిస్తాయని సమాచారం.
News December 22, 2025
బీచ్ వాలీబాల్‌లో మెరిసిన తూ.గో కుర్రాళ్లు

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.


