News March 21, 2024

తిరుపతి: కానిస్టేబుల్ సస్పెండ్

image

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియమాలను ఉల్లంఘించరాదని ఎస్పీ హెచ్చరించారు. నారా భువనేశ్వరిని కలవడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Similar News

News April 2, 2025

ద్రవిడ వర్సిటీలో పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి సంబంధించి MA, M.Com, M.Scలో చేరడానికి APPGCET-2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ సూచించారు. మే 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. MBA/MCA కోర్సులో చేరటానికి APICET-2025 ప్రవేశ పరీక్షకు ఏప్రిల్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు cets.apsche.ap.gov.in చూడాలి.

News April 2, 2025

చిత్తూరుకు రెండో స్థానం

image

పన్ను వసూళ్లలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని డీపీఓ సుధాకర్ రావు తెలిపారు. గత బకాయిలతో కలిపి మొత్తం వార్షిక లక్ష్యం రూ.24.45 కోట్లు కాగా.. అందులో రూ.21.34 కోట్లు వసూళ్లయ్యాయన్నారు. ఇందులో పన్నుల లక్ష్యం రూ.17.41 కోట్లకు గాను రూ.14.85, పన్నేతర లక్ష్యం రూ.6.84 కోట్లకు గాను రూ.6.49 కోట్లు వచ్చిందన్నారు. మొత్తం లక్ష్యంలో 87 శాతం వసూలైనట్లు ఆయన వెల్లడించారు.

News April 2, 2025

చిత్తూరులో ప్రాణం తీసిన ఫోన్ నంబర్..!

image

ఓ ఫోన్ నంబర్ వివాదం ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు తాలూకా ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. ఏనుగుంట్లపల్లి హరిజనవాడకు చెందిన ఉమకు 14 ఏళ్ల కిందట వివాహం జరగ్గా.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె ఫోన్ నంబర్ పక్కింట్లో ఉండే శివశంకర్ ఫోన్‌లో ఉంది. దీనిని గమనించిన అతని భార్య సుజాత.. ఉమతో పాటు భర్తను నిలదీసింది. దీంతో మనస్థాపం చెంది ఉమ ఇంట్లోనే ఉరేసుకుంది.

error: Content is protected !!