News February 14, 2025
తిరుపతి: కిరణ్ రాయల్‌పై కేసు నమోదు

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్‌పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News January 11, 2026
వీఆర్‌కు కర్నూలు పోలీసులు

కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను <<18815075>>వీఆర్<<>>కు పంపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకుని బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. బాధితుడు ఈ విషయమై డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నలుగురిని సస్పెండ్ చేశారు.
News January 11, 2026
IMH కడపలో 53 పోస్టులకు నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(IMH), కడపలో 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు జనవరి 5 నుంచి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిప్లొమా(ఆక్యుపేషనల్ థెరపీ, ECG, అనస్థీషియా, యోగా), BA, BSc, MSW, DMLT, MLT, MA(సైకాలజీ), PG డిప్లొమా ,M.Phil ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
News January 11, 2026
పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన <<18824096>>పంత్<<>> న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. అయితే రెగ్యులర్ కీపర్‌గా రాహుల్ ఉన్న నేపథ్యంలో రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన జురెల్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కాగా ఇవాళ 1.30pmకు వడోదరాలో తొలి వన్డే ప్రారంభం కానుంది.


