News July 14, 2024
తిరుపతి కొత్త SPగా సుబ్బరాయుడు

తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బరాయుడిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయనను ప్రత్యేకంగా ఏపీకి తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు ఓఎస్డీగా పనిచేసిన అనుభవం ఉండటంతో తిరుపతి ఎస్పీగా నియమించారు. అలాగే టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్‌ను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు తిరుపతి ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్‌ను కడప ఎస్పీగా నియమించారు.
Similar News
News November 7, 2025
కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల స్థాపన ఇక్కడే.!

☞ కుప్పం (M) పలార్లపల్లి వద్ద అలీఫ్ ☞ అనిమిగానిపల్లి సమీపంలో ఆదిత్య బిర్లా
☞శాంతిపురం (M) తంబిగానిపల్లి వద్ద మదర్ డెయిరీ ☞ రామకుప్పం(M) విజిలాపురం వద్ద ఈరైస్
☞గుడిపల్లి (M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ACE, శ్రీజ డెయిరీ, SVF సోయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
☞ మొత్తం రూ.2,203 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటు
☞ 8న వర్చువల్‌గా CM చంద్రబాబు శంకుస్థాపన.
News November 7, 2025
స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.
News November 6, 2025
దూడపై చిరుతపులి దాడి.?

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


