News October 10, 2025
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తిరుపతి లక్ష్మీపురం కూడలి వద్ద గరుడ వారధిపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ సేఫ్టీ వాల్‌ను బలంగా ఢీకొట్టి కింద పడిపోయారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 10, 2025
బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్

2024-25 రబీ సీజన్ బియ్యాన్ని రా మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి అందించాలని జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం మిల్లర్లతో సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కేటాయింపులు మిల్లర్ల సూచనల ప్రకారం ఉంటాయని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్‌లను తక్షణం సమర్పించాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు రావద్దన్నారు.
News October 10, 2025
బిహార్‌లో రేపు NDA కూటమి సమావేశం

త్వరలో బిహార్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో NDA కూటమి రేపు అక్కడ కీలక సమావేశం నిర్వహించనుంది. JDU, BJPతో పాటు కూటమిలోని ఇతర పార్టీల సీట్ల పంపకాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 243 సీట్లలో జేడీయూ, బీజేపీ 205 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏయే స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి విడత ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
News October 10, 2025
పాఠశాలలో మత బోధనలు నిజమే: ఎంఈఓ శ్రీధర్

వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మత బోధనలు చేసిన విషయం నిజమేనని ఎంఈఓ శ్రీధర్ నిర్ధారించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు చేరుకునే యాజమాన్యంతో విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ క్రైస్తవ మతస్థుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధనలు చేసిన విషయం నిజమేనని తేలిందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నివేదిక డీఈఓకు అందిస్తామన్నారు.