News October 10, 2025
తిరుపతి: గ్యాంగ్ రేప్.. ఇద్దరికి జైలుశిక్ష

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన యువతి(19) తన స్నేహితుడితో కలిసి స్థానిక రైల్వే స్టేషన్ దగ్గరకు 2019 ఫిబ్రవరి 3న వెళ్లింది. అక్కడ నలుగురు యువకులు స్నేహితుడిని కొట్టి డబ్బులు తీసుకున్నారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. నిందితుల్లో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు తిరువళ్లూరు నవీన్ కుమార్(బొగ్గుల కాలనీ సూళ్లూరుపేట), కాకుల దేవ(సాయి నగర్, సూళ్లూరుపేట)కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
Similar News
News October 11, 2025
SKLM: ‘సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం పట్టుబడి ఉందని ఆముదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూన, రవికుమార్ గొండు శంకర్ అన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆక్ట్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News October 11, 2025
ఏలూరులో ఈనెల 13 ‘జీఎస్టీ హేలాపురి ఉత్సవం’

ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి శుక్రవారం గూగుల్ మీట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు వారం రోజుల పాటు జరిగే ‘జీఎస్టీ హేలాపురి ఉత్సవం’ను పండుగ వాతావరణంలో విజయవంతం చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సీఆర్ రెడ్డి కళాశాలలో జరగబోయే కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
News October 11, 2025
ఆదిలాబాద్: సోమవారం యథావిధిగా ప్రజావాణి

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రజలు వినతులను స్వీకరించేందుకు ప్రజావాణిని తిరిగి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.