News April 13, 2024
తిరుపతి: గ్రీన్ ఛానల్ ద్వారా హార్ట్, లివర్ తరలింపు

తాను మరణించినా అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. తమ వాళ్లు మరణించినా అంత దు:ఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నుండి గుండె, లివర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అనంతరం అక్కడ నుండి పోలీసుల భద్రత నడుమ ప్రత్యేక ఆంబులెన్స్ లలో గుండెను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 6, 2025
రేపు అధికారికంగా వాల్మీకి జయంతి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. రేపు జిల్లా సచివాలయంలోని వివేకానంద భవన్‌లో ఉ.10.30 గం.లకు మహర్షి వాల్మీకి చిత్రపటానికి అంజలి ఘటించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
News October 6, 2025
నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.
News October 6, 2025
జయచంద్ర రెడ్డి చుట్టూ అన్నీ వివాదాలే..?

MLA అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి ఎన్నికైన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జయచంద్ర రెడ్డి TDP బీ ఫార్మ్ తీసుకోవడంతో శంకర్ యాదవ్ వర్గీయులు తీవ్ర ఆందోళనలు దిగారు. ఎన్నికల టైంలో పోలింగ్ బూతుల్లో ఏజంట్లను నియమించుకోలేక పోయారని వాదన ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి సహకారం అందిస్తున్నట్లు గతంలో తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.