News October 24, 2025
తిరుపతి గ్రేటర్ ప్రతిపాదనకు చెక్ పెడుతున్నారా…?

తిరుపతి గ్రేటర్ ప్రతిపాదన ఇవాళ కౌన్సిల్‌లో కీలకం కానుంది. CM చంద్రబాబు వైజాగ్, విజయవాడ తరహాలో తిరుపతిని డెవలప్ చేయాలని సంకల్పించి, రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల 69 పంచాయతీలను విలీనంచేసే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. మేయర్ సుముఖంగా ఉన్నప్పటికీ, కొందరు MLAలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ప్రక్రియ వాయిదాపడే అవకాశముంది. గ్రేటర్ లేకుండా తిరుపతి అభివృద్ధి సాధ్యం కాదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.
Similar News
News October 25, 2025
పెద్దపల్లిలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన DM&HO

పెద్దపల్లిలోని స్కానింగ్ సెంటర్లను DM&HO డాక్టర్ వాణిశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ ప్రసాద్ మెమోరియల్, లీలావతి నర్సింగ్ హోమ్, శ్రీదేవీ ఆసుపత్రి, రమా ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. రిజిస్టర్డ్ గైనకాలజిస్ట్ ఏ స్కాన్‌లు చేస్తున్నారా, గర్భిణులకు స్కాన్ చేసిన వివరాల రికార్డ్స్ పరిశీలించారు. ఫారం ఎఫ్ సరిగా నమోదు చేస్తున్నారా లేదా ఆరా తీశారు.
News October 25, 2025
US, EU ఆంక్షలను పాటిస్తాం: రిలయన్స్

రష్యా చమురు కంపెనీలపై అమెరికా, ఈయూ ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లాకాయిల్‌పై అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. ఆ రెండు సంస్థలతో వ్యాపారాన్ని నవంబర్ 21 నాటికి ముగించాలని రిఫైనరీలను ఆదేశించాయి.
News October 25, 2025
కొడిమ్యాల: ‘ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలి’

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కొడిమ్యాల తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. సండ్రళ్లపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని లత సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.


