News October 10, 2025
తిరుపతి: చెవిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వానికి నోటిసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Similar News
News October 10, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి కోసం WAITING

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులు ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంకా వెనుకంజలో ఉంది. పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. 3, 4 పేర్లను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపించింది. 2, 3 రోజుల్లో పార్టీ క్యాండిడేట్ ఎవరనేది ప్రకటిస్తామని బీజేపీ TG చీఫ్ రామచందర్ రావు తెలిపారు. కాగా కార్యకర్తల్లో అభ్యర్థి ఎవరనే టెన్షన్, ఉత్సాహం నెలకొంది.
News October 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: రేపటినుంచి బీజేపీ ప్రచారం

జూబ్లీహిల్స్‌లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచాయి. నెక్ట్స్ రంగంలోకి బీజేపీ దిగనుంది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రచారం చేయాలని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదేశించారు.
News October 10, 2025
‘అరి’ రేటింగ్&రివ్యూ

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే సినిమానే ‘అరి’. మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తారనేది డైరెక్టర్ జయశంకర్ కథతో ఆవిష్కరించారు. సాయికుమార్, వినోద్ వర్మ, అనసూయ నటన మెప్పించింది. అనూప్ మ్యూజిక్, క్లైమాక్స్ బాగుంది. స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు వాస్తవ దూరంగా ఉండటం, కామెడీ పండకపోవడం మైనస్.
రేటింగ్- 2.5/5