News December 12, 2025
తిరుపతి జనసేనలో అంతర్గత లుకలుకలు.!

తిరుపతి జనసేనలో అంతర్గత కుమ్ములాటలు బయట పడినట్లు తెలుస్తోంది. కొందరు YCP నేతలకు సహకరిస్తున్నారట. DCM పవన్ మార్ఫింగ్ ఫొటోపై కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని ఆ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారట. పార్టీలో లేని వ్యక్తి పెత్తనం ఏంటి అని చర్చించుకుంటున్నారట. అందుకే కేసు నమోదుకే పోలీసులు పరిమితమయ్యారని వారు విమర్శిస్తున్నారు. పోలీసులు మాత్రం విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
సంగారెడ్డి: రెండో విడతకు 1,200 మందితో బందోబస్తు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగే 10 మండలాల్లో 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News December 12, 2025
ఎన్నికల విధులకు మినహాయింపు లేదు: డీఈవో

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు ఎలాంటి మినహాయింపు లేదని డీఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ నెల 13న ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని ఆదేశించారు. కొందరికి మినహాయింపు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొన్నారు.
News December 12, 2025
మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.


