News January 30, 2025
తిరుపతి జిల్లాలో పెన్షన్లకు రూ.112.19 కోట్లు

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 2,63,191 మంది పెన్షన్ దారులకు రూ.112.19 కోట్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పెన్షన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని తెలిపారు.
Similar News
News February 28, 2026
పుష్పగిరి: ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరులు

వల్లూరు మండలం పుష్పగిరి సంతాన మల్లేశ్వర ఆలయం వద్ద ఒకే విగ్రహంలో నంది, నందికేశ్వరుని రూపాలు ఉండటం అత్యంత అరుదని చరిత్రకారుడు బి.రమేష్ తెలిపారు. అర్చకులు అఖిల్ స్వామి సమాచారంతో పరిశోధించిన ఆయన ఈ శిల్పం పశుత్వం నుంచి దైవత్వానికి మారడాన్ని సూచిస్తుందన్నారు. చారిత్రక దాడుల్లో నంది ముఖం ధ్వంసమైనా లింగధారినంది, అద్భుతమైన హారాలు, అర్ధ పద్మాసనంలో ఉన్న నందికేశ్వరుని శిల్పకళ విశేషంగా ఆకర్షిస్తుందన్నారు.
News February 28, 2026
ఉండి: గ్యాస్ ప్రమాదం ఘటనలో మరో మహిళ మృతి

ఉండి చిక్కాల వీరన్న నగరంలో ఈనెల 24వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందారు. ఎస్సై నజీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ సర్వీస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో లక్ష్మి (50) గురువారం మృతి చెందింది. ఆమె తల్లి సుబ్బాయమ్మ (70) ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
News February 28, 2026
నిర్మల్: కారుణ్య నియామకాల ద్వారా పోస్టుల భర్తీ

జిల్లాలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 29 కారుణ్య నియామకాల సంబంధించి 20 నియామకాలను పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ వివరించారు. 20 పోస్టులలో.. 13 జూనియర్ అసిస్టెంట్, 6 ఆఫీస్ సబార్డినేట్, 1 కామాటి పోస్టును భర్తీ చేసినట్లు వివరించారు. వీరిని వివిధ శాఖలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా 9 పోస్టులు రోస్టర్ అంశాలతో ముడిపడి ఉన్నందున ఆ పోస్టులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.


