News April 5, 2026
తిరుపతి జిల్లాలో మర్డర్!

చంద్రగిరి(M) రామిరెడ్డిపల్లెలోని ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలో డెడ్ బాడీ కలకలం రేపింది. మృతుడిని తిరుపతి రైల్వే కాలనీకి చెందిన టాక్సీ డ్రైవర్ శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. మార్చి 28న తనపల్లి వద్ద 8 మంది స్నేహితులతో కలిసి శ్రీనివాసులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తలెత్తిన గొడవలో స్నేహితులే హతమార్చి, మృతదేహాన్ని రామిరెడ్డిపల్లె సమీపంలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Similar News
News April 13, 2026
ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో మార్పులు

AP:ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో బోర్డు ఈఏడాది కొన్ని మార్పులు చేసింది. రిజల్ట్స్‌లో విద్యార్థుల 5గ్రూపు సబ్జెక్టుల మార్కులను మాత్రమే ప్రకటిస్తారు. ఆరోదైన అదనపు సబ్జెక్టు మార్కులు వాటితో కలపరు. కాలేజీకి పంపే మార్కుల మెమొరాండంలో వాటిని వేరుగా చూపిస్తారు. ఆ సబ్జెక్టులో ఫెయిలైనా గ్రూపు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే చాలు పాస్‌గా పరిగణిస్తారు. MPCలో బయాలజీ, BiPCలో మాథ్స్ అదనపు సబ్జెక్టులుగా ఉన్నాయి.
News April 13, 2026
భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ హిట్ ఇస్తాడా?

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్‌గా లాంచ్ అయిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ ఇవ్వలేదు. ఆ మూవీతో పాటు తర్వాత వచ్చిన ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కాంత’ కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం ఆమె అక్కినేని అఖిల్‌తో ‘లెనిన్’లో నటిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం అఖిల్‌కు ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ ఈ ఏడాది జూన్ 26న థియేటర్లలోకి రానుంది.
News April 13, 2026
ముత్యాలమ్మ జాతరలో నిఘా నీడ.. 400 మందితో భద్రత

ముత్యాలమ్మ జాతర సందర్భంగా 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. ఈనెల 14 నుంచి 17 వరకు జరిగే ఉత్సవాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తామని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మద్యం అల్లర్లు, చైన్ స్నాచింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


