News March 10, 2025

తిరుపతి జిల్లాలో మొదలైన భానుడి ప్రతాపం

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండల దెబ్బకు సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాలలో ఉదయం 11 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వయస్సు పైబడిన వారు పని ఉంటే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News March 10, 2025

పోలీస్ గ్రీవెన్స్‌కి 73 ఫిర్యాదులు: ఎస్పీ

image

నెల్లూరు ఉమేశ్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో సోమ‌వారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మాన్ని జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ నిర్వ‌హించారు.  బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీక‌రించి వారితో స్వ‌యంగా మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ కి మొత్తం 73 ఫిర్యాదులు అందాయ‌ని ఎస్పీ చెప్పారు. ప్ర‌తీ అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

News March 10, 2025

ఆస్ట్రేలియా వద్దే అత్యధిక ట్రోఫీలు!

image

ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ఇండియా ఖాతాలో 7 ICC ట్రోఫీలు నమోదయ్యాయి. ఇందులో 2 వన్డే వరల్డ్ కప్స్, 2 టీ20 వరల్డ్ కప్స్‌తో పాటు 3 ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. అయితే, అత్యధిక ట్రోఫీలు మాత్రం ఆస్ట్రేలియా వద్దే ఉండటం గమనార్హం. AUS ఏకంగా 10 ICC ట్రోఫీలు గెలుచుకుంది. ఇండియా తర్వాత వెస్టిండీస్ వద్ద 5, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్ వద్ద చెరో మూడు ట్రోఫీలున్నాయి.

News March 10, 2025

సిరికొండ: వడ్డీ వ్యాపారుల వేధింపులకు యువకుడి బలి

image

సిరికొండ మండలం ముషిరునగర్‌కు చెందిన మనోహర్ నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన జ్యోతి వద్ద ఆరు నెలల క్రితం రూ.40వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.80వేలు చెల్లించాలని మనోహర్‌పై కొద్దికాలంగా జ్యోతి మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్ళారు. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!